చిక్కుల్లో ‘కిక్‌ 2’ నటుడు.. జైలుశిక్ష తప్పదా?‌

‘కిక్ 2’ మూవీ నటుడు రాజ్‌పాల్ యాదవ్ కష్టాలు రెట్టింపయ్యాయి. ఐదు కోట్లు రుణం‌ తీసుకుని చెల్లించని కేసులో రాజ్‌పాల్‌ యాదవ్‌, ఆయన వైఫ్ రాధలను దోషులుగా తేల్చింది ఢిల్లీలోని ఓ న్యాయస్థానం. ఈనెల 23న వీళ్లకి శిక్షను ఖరారు చేయనుంది. పదేళ్ల కిందట ఫస్ట్ హిందీ ఫిల్మ్ ‘అతా.. పతా.. లాపతా’ కోసం యాదవ్‌ ఢిల్లీకి చెందిన బిజినెస్‌మేన్ ఎంజీ అగర్వాల్‌ నుంచి రూ.5 కోట్లు తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో వ్యాపారవేత్త కేసు పెట్టడం, యాదవ్‌ జైలుకి వెళ్లడం జరిగిపోయింది.

ఆ తర్వాత కోర్టు ఆయన ఆస్తులు, బ్యాంకు ఖాతాల వివరాలను కూడా పరిగణనలోకి తీసుకుని, విచారణ జరపమని ఆదేశించింది. 2015లో రూ.1.58 కోట్లు చెల్లించానని, ఇక రూ.3.42 కోట్లు మాత్రమే చెల్లించాలని తెలిపాడు యాదవ్‌. మరో 30 రోజుల్లో మొత్తం రుణం చెల్లిస్తానని వెల్లడించాడు. ఈ మేరకు ఇరు వర్గాల వాదనలు విన్నన్యాయస్థానం తాజాగా యాదవ్‌ దంపతుల్ని దోషులుగా పేర్కొన్న విషయం తెల్సిందే!

 

Related News