ప్రిన్స్ బ్యూటీ కైరా ప్రతాపం

మహేష్‌బాబు ‘భరత్ అనే నేను’ ఫిల్మ్‌తో దక్షిణాదిన పాపులర్ అయ్యింది హీరోయిన్ కైరాఅద్వానీ. ఆ తర్వాత చెర్రీతో ఒకటి, కోలీవుడ్‌లో విజయ్ పక్కన మరొకటి ఛాన్స్ అందుకుంది. ఇక్కడే కాస్త తెలివి ప్రదర్శించి తనను తాను ప్రమోట్ చేసుకునే పనిలో పడింది. ఈ క్రమంలో ‘ఎగ్జిబిట్’ అనే మ్యాగజైన్‌కి అదిరిపోయే ఫోటోషూట్ ఇచ్చింది.

కలర్‌ఫుల్ గౌన్‌లో తనదైన శైలిలో కనిపించి యూత్‌ని మరింత హీటెక్కించింది కైరా. గౌనుకితోడు ఓ వైపు రేడియో, మరోవైపు ఖుజరహో శిల్పంలా పోజులిచ్చింది. ఈ దెబ్బకు సౌత్‌లో ఈమెకి మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయమని అంటున్నారు. అన్నట్టు ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్‌లో తన విశ్వరూపాన్ని బయటపెట్టుకున్న విషయం తెల్సిందే!

READ ALSO

Related News