కేరళ కకావికలం

 

భారీ వర్షాలకు కేరళ కకావికలమౌతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 32 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 55వేల మంది నిర్వాసితులు అయ్యారు. పెరియార్‌ నది నీటి మట్టం అతివేగంగా పెరుగుతోంది.

ఇడుక్కి రిజర్వాయర్‌ నుంచి మరింత నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో ఇడుక్కితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఆసియాలో అతిపెద్ద ఆర్చ్‌ డ్యాం ‘ఇడుక్కి రిజర్వాయర్‌’ నిండడంతో మరో 3 గేట్లను ఎత్తారు.

వర్షాల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ఏడు ఉత్తర జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు అదనంగా మరో 5 ఆర్మీ బృందాలను రంగంలోకి దింపారు. ఇప్పటివరకూ 53,501 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇలాఉండగా, దేశవ్యాప్తంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసిన వానల ధాటికి ఏడు రాష్ట్రాల్లో ఇప్పటివరకు మొత్తం 718 మంది మృత్యువాత పడ్డారు.

Related News