తమ ఫ్రంట్ రాజకీయాలకోసం కాదని, ప్రజల కోసమేనని తెలంగాణా సీఎం కేసీఆర్ అన్నారు. శుక్రవారం సినీ నటుడు ప్రకాష్ రాజ్ తో కలిసి బెంగుళూరులో మాజీ ప్రధాని, జేడీ-ఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడతో సమావేశమైన ఆయన.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యాయని విమర్శించారు. 65 ఏళ్ళలో పాలకులు ప్రజలకు తాగునీటిని కూడా అందించలేకపోయారని, కావేరీ జలాలకోసం దశాబ్దాలుగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు పోట్లాడుకోవలసిన పరిస్థితి ఎందుకు తలెత్తిందని ప్రశ్నించారు.
కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ పరిష్కారం చూపలేకపోయింది. దేశంలో మొత్తం సాగుభూమికి నీరిచ్చినా 30 వేల టీఎంసీలు మిగులుతాయి అని కేసీఆర్ చెప్పారు. కర్నాటక ఎన్నికల్లో ప్రజలు జేడీ-ఎస్ కు మద్దతు తెలపాలని, దేవెగౌడ, కుమారస్వామిల పార్టీ కోసం ఎక్కడ అవసరమైతే అక్కడ తాను ప్రచారం నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు. కర్నాటక లోని తెలుగువారంతా జేడీ-ఎస్ కు సపోర్ట్ ఇవ్వాలని ఆయన కోరారు. గతంలో తెలంగాణా ఉద్యమానికి దేవెగౌడ మద్దతు తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా-కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచన ఎవరినో గద్దె దింఛడానికి కాదని, ప్రజా సంక్షేమం కోసమేనని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. కేసీఆర్, దేవెగౌడ సుమారు రెండు గంటల పాటు భేటీ కావడం విశేషం. బెంగుళూరుకు మళ్ళీ వస్తా అని కేసీఆర్ మీడియాతో వ్యాఖ్యానించారు.
READ ALSO
- మహానటి సావిత్రి ఆ లోటును పూడ్చుకుంటోంది !
- సానియామీర్జాకి ప్రమోషన్
- ఆ నలుగురిలో ఒకరికి ప్రిన్స్ బంపరాఫర్
- 'మహానటి' సావిత్రి.. మేకింగ్ వీడియో
- రాజు- మంత్రి మళ్లీ కాంబో!
- ‘మెహబూబా’ మరో సాంగ్
- బర్త్‌డే బాయ్‌కి ప్రియ హ్యాపీ విషెస్
- రజనీకాంత్‌కి అనారోగ్యం!
- బీజేపీలో రెండు వికెట్లు డౌన్.. అడ్వాంటేజ్ వైసీపీ..!
- చాలా ఒత్తిడికి గురయ్యాను.. మూడో ఫిల్మ్ ఎప్పుడంటే..
- కేవలం పదిహేను నిమిషాల్లో మోదీని కడిగేస్తా !
- కరణ్, సారా, శ్వేతాబచ్చన్.. డ్యాన్స్ హంగామా
- అతడ్ని విడుదల చేయండి
- పోర్న్ వీడియో ఎందుకు ట్వీట్ చేసింది ?
- 'భరత్ అనే నేను’ తమిళ్ రీమేక్.. హీరో ఎవరంటే..!
- బాలయ్యతో ఒరిగిన మైలేజ్ ఎంత? డ్యామేజ్ ఎంత?