పవన్‌ను వెనకేసుకొచ్చిన కత్తి

ఇటీవల చాలా కాలంగా పవన్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన సినీ, రాజకీయ విశ్లేషకుడు కత్తి మహేష్ ఇప్పుడు తన ఫోకస్ అంతా టీడీపీ మీద పెట్టినట్టు కనిపిస్తోంది. బీజేపీతో వ్యభిచారం చేసింది మీరంటూ టీడీపీపై నిప్పులు చెరగడమేకాదు.. పవన్‌ని అంటే ఎట్లా అంటూ ఆయనకు బాసటగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మీద ఎప్పుడూ కత్తి కామెంట్ పడిన దాఖలాలు లేవేంటి అనడిగితే అది వేరే సంగతి.. తాజాగా కత్తి  చేసిన ట్వీట్ ఇలా ఉంది.. ‘‘గ్లోబల్ టెర్రర్ విషయంలో అమెరికా అందర్నీ భయపెట్టేది. మీరు మాతో కలిసి రాకపోతే, మిమ్మల్ని కూడా టెర్రరిస్టులుగా పరిగణిస్తాం అని. అదే పద్ధతి తెలుగుదేశం అవలంభిస్తోంది. మాతో లేకపోతే మీరు బీజేపీ ఏజెంట్లు అని. బీజేపీతో వ్యభిచారం చేసింది మీరు. ఇప్పుడు పవన్ కల్యాణ్‌ని జగన్‌ని అంటే ఎట్లా!’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related News