హంగ్‌లో అంతా గడబిడ ! ఆ నలుగురూ ఎక్కడ ?

కర్నాటక రాజకీయాలు ఇంకా టీవీ సీరియల్స్‌లా సా..గుతున్నాయి. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..రాజశేఖర్ పాటిల్, నాగేంద్ర, ఎం.వై. పాటిల్, ఆనంద్ సింగ్ అజ్ఞాతంలోకి వెళ్ళడంతో కాంగ్రెస్-జేడీ-ఎస్ కూటమి అప్రమత్తమైంది. అందర్నీ భద్రంగా తమవెంట ఉంచుకుని ‘ జారిపోకుండా ‘ చూసేందుకు తంటాలు పడుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తమవద్ద తగినంత సంఖ్యాబలం ఉందని చెప్పుకొంటున్నా..కాస్త అయోమయ పరిస్థితినే ఎదుర్కొంటోంది. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ సభ్యులు బుధవారం సమావేశమైనప్పటికీ, తమ ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో మౌనం వహించారు. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని కామ్ అయిపోయారు.

పదవి నుంచి వైదొలగుతున్న సిద్దరామయ్య మాత్రం.. తామంతా కలిసికట్టుగా ఉన్నామని, ఎవరూ మిస్ కాలేదని తెలిపారు. ముగ్గురు ఎమ్మెల్యేల ‘ జాడ ‘ తెలియడంలేదన్నవార్తలను ఆయన కొట్టివేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న విశ్వాసం తమకుందని అన్నారు. అటు-ఈ పరిణామాలపై జేడీ-ఎస్ నేత కుమారస్వామి కూడా కాస్త ఆందోళనగానే ఉన్నారు. తమ కూటమి ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించి బేరసారాలకు దిగుతారేమో అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘

 

 

ఎమ్మెల్యే షాపింగ్ ‘ అంటూ వార్తలు వస్తున్నాయి కదా అని నిట్టూర్చారు. ఇక..ఆయన ఆవేదను నిజం చేస్తున్నట్టుగా.. తమ వద్దకు బీజేపీ నేతలు రాయబారం పంపుతున్నారంటూ అమరగౌడ లింగనగౌడ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే షాకింగ్ న్యూస్ చెప్పారు. వాళ్ళు తనదగ్గరకు వచ్చి… తమతో చేతులు కలిపితే మీకు మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపారని, అయితే తను కుమారస్వామి వెంటే ఉంటానని, ఆయనే తమ ముఖ్యమంత్రి అని అన్నారు.

జేడీ-ఎస్ కు చెందిన శర్వన్న అనే మరో ఎమ్మెల్యే.. తనను కూడా ఐదారుగురు బీజేపీ నేతలు కలిసి ఇలాంటి ఆఫరే ఇవ్వజూపారని చెప్పారు. మరోవైపు-తమ పార్టీ కొందరు కాంగ్రెస్-జేడీ-ఎస్ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నట్టు బీజేపీ నేత కె.ఎస్. ఈశ్వరప్ప స్పష్టంగా ప్రకటించడం విశేషం.

READ ALSO

Related News