దేవెగౌడ కుటుంబంలో చీలిక.. యెడ్యూరప్పకు గ్రీన్ సిగ్నల్?

కన్నడ నాటకంలో క్లయిమాక్స్ సీన్లు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. సిద్ధరామయ్య ఊస్టింగ్ ఖాయం కావడంతో.. జేడీఎస్ కి బేషరతు మద్దతు పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. సీఎం కుర్చీనెక్కడానికి సిద్ధమైన కుమారస్వామి.. గవర్నర్ అపాయింట్ మెంట్ తీసుకుని.. కాంగ్రెస్ మద్దతు లేఖను అందజేశారు. ఈ గ్యాప్ లోనే.. బీజేపీ అధిష్టానం పావులు కదిపింది. దేవెగౌడ కుటుంబంలో చీలిక తెచ్చి పబ్బం గడుపుకునే ఆలోచన చేసిన యడ్యూరప్ప.. ఆ దిశగా సక్సెస్ అవుతున్నారు కూడా. కుమారస్వామి సోదరుడు రేవణ్ణతో పాటు మరో 12 మంది జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు తనకుందంటూ గవర్నర్ ను కలిశారు యెడ్యూరప్ప. బలనిరూపణకు వారం రోజులు గడువు కావాలన్న తన వినతికి గవర్నర్ అంగీకరించారని చెబుతున్నారు.

ఇదిలావుండగా.. బయట నుంచి మద్దతు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనను దేవెగౌడ తోసిపుచ్చారు. ప్రభుత్వంలో కాంగ్రెస్ కలిసే వుండాలని షరతు పెట్టారు. జేడీఎస్‌కు సీఎం పదవి, కాంగ్రెస్‌కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చుకునే దిశగా చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌కు 20, జేడీఎస్ కు 14 మంత్రి పదవులు ఇచ్చేందుకు ఇరుపార్టీలు అంగీకరించినట్టు సమాచారం. అటు.. ‘ఆపరేషన్ రిసార్ట్’ పాలిటిక్స్ కూడా షురూ అయ్యాయి. తమ ఎమ్మెల్యేల్ని బీజేపీ నుంచి దూరంగా ఉంచడానికి జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఎమ్మెల్యేల్ని బెంగుళూరు వెలుపల ‘సురక్షిత’ ప్రదేశాలకు పంపి.. కాపలా పెట్టనున్నారు.

READ ALSO

Related News