కర్ణాటకలో మరో లొల్లి… ప్రొటెమ్ స్పీకర్‌గా బీజేపీ నేత

కర్ణాటకలో మరో లొల్లి మొదలైంది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప  శనివారం సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవాలని, ప్రొ-టెమ్ స్పీకర్ ఆధ్వర్యంలో ఇది జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. గవర్నర్ వాజూ భాయ్ ఆర్.వాలా రంగంలోకి దిగారు. ప్రొ-టెమ్ స్పీకర్ గా సీనియర్ బీజేపీ నేత కె.జి.బోపయ్య (కొంబరన గణపతి బోపయ్య) ను నియమించారు. విరాజ్ పేట్ నియోజకవర్గం నుంచి ఇటీవలి ఎన్నికల్లో  గెలుపొందిన ఈయన.. అంతకుముందు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2009 నుంచి 2013 వరకు స్పీకర్ గా వ్యవహరించారు. అయితే ప్రొ-టెమ్ స్పీకర్ గా ఈయన నియామకాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. గవర్నర్ బీజేపీ ఏజంటులా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టిన ఈ  పార్టీ నేతలు… గవర్నర్ చర్యపై సుప్రీంకోర్టుకెక్కాలని యోచిస్తున్నారు.  ఇదిలాఉండగా..ప్రొ-టెమ్ స్పీకర్ గా కాంగ్రెస్ సీనియర్ నేత, 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్వీ దేశ్ పాండే ను నియమిస్తున్నట్టు, ఈ మేరకు  కర్ణాటక అసెంబ్లీ సచివాలయం ఆయన పేరును సిఫారసు చేసినట్టు మొదట వార్తలు వచ్చాయి.

READ ALSO

Related News