రంగంలో రేవణ్ణ.. తండ్రికి ఝలక్ ?

కర్నాటక రాజకీయాలు క్షణానికో రకంగా రంగులు మార్చుకుంటున్నాయి. మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిపోయిన బీజేపీ ఎలాగైనా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుండగా.. అటు-కాంగ్రెస్ పార్టీ జేడీ-ఎస్ తో జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతోంది. బెంగుళూరులో కాంగ్రెస్, జేడీ-ఎస్ నేతల మంతనాలకు సన్నాహాలు జోరందుకున్నాయి.

అయితే.. జేడీ-ఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ పెద్ద కొడుకు రేవణ్ణ హఠాత్తుగా రంగంలోకి వచ్చారు. ఆయనతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. హసన్ జిల్లా హోలెనరసిపూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఈయన.. తనతో పదిమంది ఎమ్మెల్యేలు ఉన్నారని వారితోబాటు మీకు మద్దతునిచ్చేందుకు తను సిద్ధమని కమలనాథులకు హామీ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. హంగ్ ఏర్పడితే తమ్ముడు కుమారస్వామికి సీఎం పదవిని ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇవ్వడంతో..రేవణ్ణ దీన్ని అడ్డుకునేందుకు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది.

READ ALSO

Related News