రూ.100 కోట్లా? అది ఆయన ఊహ !

జేడీ-ఎస్, కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 100 కోట్లు, మంత్రి పదవి ఇస్తామని బీజేపీ ప్రలోభ పెట్టిందంటూ జేడీ-ఎస్ చీఫ్ కుమారస్వామి చేసిన ఆరోపణను కర్నాటక బీజేపీ ఇన్-చార్జ్, కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ఖండించారు.

ఎమ్మెల్యేకు వంద కోట్లు అన్నది ఆయన ఊహాజనితమని అన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఇలాగే రాజకీయాలు చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తామని, కర్ణాటకలో ఎడ్యూరప్ప నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జవదేకర్ పేర్కొన్నారు.

READ ALSO

Related News