కర్ణాటక అసెంబ్లీలో అరుదైన సీన్

కర్ణాటక అసెంబ్లీలో శనివారం అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. సీఎం యడ్యూరప్ప బలపరీక్ష జరిగేముందు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్. అదే సమయంలో బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు పక్కపక్కనే కూర్చొని ముచ్చటించుకోవడం కనిపించింది. విశ్వాస పరీక్షలో తాము నెగ్గుతామంటే.. కాదు తామే నెగ్గుతామంటూ ఒకరిపై మరొకరు సరదాగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్న సన్నివేశం అది.

ఇక్కడ మరో విషయం ఏంటంటే.. లోక్‌సభ, రాజ్యసభ‌లకు చెందిన ఇరు పార్టీల నేతలు ఒక రాష్ర్ట అసెంబ్లీ గ్యాలరీలో కూర్చోవడం చాలా అరుదు. బయట ఉప్పునిప్పులా వుంటూ ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు సంధించుకునే మల్లిఖార్జున ఖర్గే(కాంగ్రెస్), అనంత కుమార్ (బీజేపీ) లాంటి వైరిపార్టీల నేతలు ఒకేవరుసలో కనిపించడం కొనమెరుపు.

Related News