విశ్వరూపం2.. రీసెన్సారింగ్?

కమల్ నాలుగేళ్ల కష్టానికి ఫలితం ‘విశ్వరూపం 2’. విడుదల తర్వాత కూడా ఈ మూవీకి కష్టాలు తప్పేలా లేవు. U/A సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ.. సినిమా మొత్తం డజన్ల కొద్దీ కత్తెర్లేసి.. చేతిలో పెట్టింది సెన్సార్ బోర్డ్. దాదాపు ఆరేడు నిమిషాల కంటెంట్ మీద మ్యూట్ చేయాలన్న ఆదేశాలతో.. డైలాగ్స్ అర్థం కాక ప్రేక్షకులకు చిర్రెత్తుకొచ్చిందంటూ రివ్యూలు చెబుతున్నాయి. ఏదోవిధంగా సినిమా డివైడ్‌టాక్‌తో నడుస్తున్నప్పటికీ.. కమల్‌కి మళ్ళీ కోర్టు కష్టాలు తప్పకపోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని సన్నివేశాలు, డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయన్న కారణంగా సినిమాకు ‘రీసెన్సార్’ గండం పొంచి వుంది.

 

హీరోయిన్ పూజకుమార్ చెప్పే ‘భారతమాత’ డైలాగ్ మీద తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అటు.. కమల్-పూజల మధ్య నడిచిన బెడ్‌రూమ్ రొమాన్స్ శృతి మించిందని, ఒక లిప్‌లాక్ సీన్‌ని తొలగించినప్పటికీ, మిగిలిన మరో రెండు లిప్‌లాక్స్ కూడా డిలీట్ చేయాలన్న ఉద్దేశంతో.. సినిమాను మరోసారి సెన్సారింగ్‌కి పిలవొచ్చని కోలీవుడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఇదే నా చివరి సినిమా అని ప్రకటించిన కమల్.. తన కెరీర్ క్లయిమాక్స్‌లో సైతం ఇక్కట్ల పాలవ్వడం ఒక ట్రాజెడీ.

READ ALSO

Related News