కళా వర్సెస్ కన్నా.. బిగ్ ఫైట్


ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీదుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పైకి దండయాత్ర చేసేందుకు రెడీ అయ్యారు టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు. అమిత్ షా, నరేంద్రమోదీ చేసిన పాపాలను ఛాలెంజ్ చేస్తూ కళా వెంకట్రావు, కన్నాకు బహిరంగ లేఖ రాశారు. అందులోని కీలక అంశాలేంటో చూద్దాం..

 

> జగన్‌ లక్ష కోట్ల అవినీతి కుంభకోణానికి సహకరించినందుకు 2012లో మీకు సీబీఐ నోటీసులు ఇచ్చింది వాస్తవం కాదా?

 

> జగన్ ఈడీ కేసుల విచారణ జాప్యం, ఈడీ అటాచ్‌ చేసిన నిధులను వెనక్కి తీసుకోవడంలో మీ పాత్ర ఉందనడం నిజం కాదా?

 

> రాఫెల్‌ ఒప్పందంలో కుంభకోణం జరిగిందని మీ పార్టీకి చెందిన అరుణ్‌శౌరి, యశ్వంత్‌ సిన్హా ప్రకటించారు

దీనికి మీ సమాధానం ఏమిటి?

 

> అమిత్‌షా తనయుడు జైషా కంపెనీ టెంపుల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ టర్నోవర్‌ ఒక్కసారిగా పెరగడానికి కారణం చెప్పగలరా?

 

> మోదీకి అత్యంత సన్నిహిత సంస్థ అయిన ఎస్సార్‌ ఆయిల్స్ ద్వారా రూ.50 వేల కోట్ల కుంభకోణం జరిగినట్టు చర్చ జరుగుతోంది దీనికి మీ సమాధానం ఏమిటి? అంటూ తన లేఖలో కన్నాను ప్రశ్నించారు కళా వెంకట్రావు.

 

Related News