ఎన్టీఆర్ బయోపిక్, జయలలిత‌ను కాను

ఎన్టీఆర్ లైఫ్ స్టోరీ ఆధారంగా వెండితెరపై మొదలుకానున్న ఫిల్మ్ ‘ఎన్టీఆర్‌’. ప్రస్తుతం నటీనటుల ఎంపిక శరవేగంగా జరుగుతోంది. ఇదిలావుండగా జయలలిత రోల్‌లో కాజల్ కనిపిస్తోందంటూ ఇటీవల ఓ రేంజ్‌లో ప్రచారం సాగింది. డైరెక్టర్ తేజ.. ఈమెని రిక్వెస్ట్ చేయడం, ఓకే చేసిందని వార్తలు లేకపోలేదు. ఈ విషయమై ఓ ఇంగ్లీష్  డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కాజల్, ఆ వార్తల్లో నిజంలేదని, ఇప్పటివరకు తనను ఎవరూ అప్రోచ్ కాలేదని తెలిపింది.

ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక పూర్తి కాలేదని, ఆ ప్రక్రియ తర్వాత అధికారిక ప్రకటన చేయనుంది యూనిట్. ఎన్టీఆర్‌ రోల్‌లో ఆయన కొడుకు బాలకృష్ణ నటిస్తున్నాడు. నారా చంద్రబాబు పాత్రలో రాణా, ఎన్టీఆర్‌ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్‌, శ్రీదేవి పాత్రలో దీపికా కనిపించే అవకాశాలు ఉన్నట్లున్నట్లు వార్తలు వినిపించిన విషయం తెల్సిందే!

 

Related News