కాజల్ ఆ హీరోని రిజెక్ట్ చేస్తుందా ?

గ్లామర్ ఇండస్ర్టీకి కాజల్ వచ్చి దశాబ్దంపైనే అయ్యింది. గతేడాది తర్వాత ఈ అమ్మడు పెద్ద ప్రాజెక్టులు చేసిన సందర్భం లేదు. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలంతా మార్కెట్‌ని విస్తరించుకునే క్రమంలో ఉత్తరాది బ్యూటీలవైపు మొగ్గు చూపడంతో ఇక కాజల్ పనైపోయిందనే టాక్ జోరుగా నడుస్తోంది.

తాజగా .. చందమామ బ్యూటీ, రాజశేఖర్‌‌కి జోడీగా నటించనున్నట్లు తెలుస్తోంది. గరుడవేగ మూవీతో హిట్ కొట్టిన ఈ హీరో, ఇప్పుడు ప్రశాంత్‌వర్మ డైరెక్షన్‌లో యాక్షన్ మూవీ చేయనున్నాడు. ఇందులో రాజశేఖర్‌ పక్కన కాజల్‌ పేరు పరిశీలనలో వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఈమెని సంప్రదించినట్టు వార్తలొస్తున్నాయి. మరి ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? లేక తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని వచ్చిన ఛాన్స్‌ని రిజెక్ట్ చేస్తుందా? చూడాలి.

READ ALSO

Related News