లాలూకి జడ్జి మరో పంచ్

దాణా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌కి రాంచీలోని సీబీఐ కోర్టు మరో పంచ్ ఇచ్చింది. జైలులో లాలూని ఎక్కుమంది కవలకుండా కుదించింది. ఇకపై వారానికి కేవలం ముగ్గురు మాత్రమే రావాలని న్యాయమూర్తి శివపాల్‌ సింగ్‌ ఆదేశించారు. ఈ విషయం గురించి పునరాలోచించాల్సిందిగా న్యాయమూర్తిని కోరారు లాలూ. మకర సంక్రాంతి పండుగ వస్తోందని, మా ఇంట్లో స్వీట్స్‌తో అట్టహాసంగా జరుపుకుంటామని తెలిపారు. తనను కలవడానికి కేవలం ముగ్గురికే అనుమతిస్తు్న్నారని, ఈ విషయమై మరోసారి ఆలోచించండి రిక్వెస్ట్ చేశాడు.

ఇందుకు న్యాయమూర్తి సమాధాన మిస్తూ ఆ స్వీట్స్ నీకు అందేలా చూస్తానని, కానీ ముగ్గురు విజిటర్స్‌ని మించి అనుమతించేది లేదన్నారు. వెంటనే స్పందించిన లాలూ, తాను న్యాయవాదిని.. సుప్రీం, హైకోర్టులలో న్యాయవాదిగా తన పేరు నమోదైందని, నా ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని శిక్ష వేస్తారని భావించానని, మూడున్నరేళ్లు జైలు శిక్ష విధించారని అన్నాడు. దీనికి శివపాల్‌ రిప్లై ఇస్తూ నువ్వు రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ సమర్పించలేదని, అందుకే మూడున్నరేళ్లు శిక్ష వేశానని అన్నారు.

Related News