ఒక్కో ఎమ్మెల్యేకి 100 కోట్లా?: కుమారస్వామి

ప్రధాని మోదీని చూసి కర్నాటక ప్రజలు బీజేపీ కి ఓటేయలేదని చెప్పారు జేడీఎస్ ఎల్పీ నేత కుమార స్వామి. సెక్క్యులర్ ఓట్లు చీలడం వల్లే బీజేపీకి 104సీట్లు వచ్చాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో చేతులు కలిపామని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. తమ పార్టీ జేడీఎస్ లో ఎలాంటి చీలికాలేదని స్పష్టం చేశారు. కర్నాటకలో అధికారం కోసం బీజేపీ అడ్డదార్లు తొక్కుతోందని, వెంపర్లాట రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి వందకోట్ల నగదు నజరానా ఇస్తామని ప్రలోభాలకు గురిచేస్తున్నారని కుమారస్వామి అన్నారు.  తనను లెజిస్లేజర్ పార్టీనేతగా ఎన్నుకున్న అనంతరం కుమార స్వామి రేవణ్ణతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా, అటు బీజేపీ ఎల్పీ నేతగా యడ్యూరప్పను ఎన్నుకున్నారు. ఈ ఉదయం జరిగిన ఆపార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎల్పీ నేతగా ఎన్నికైన అనంతరం యడ్డీ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని గవర్నర్ ను కోరానన్నారు. 104మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మెమెురాండంను గవర్నర్ కు సమర్పించామని చెప్పారు. రేపు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా గవర్నర్ ను కోరామని తెలిపారు. అయితే, గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా తేలాల్సి ఉంది.

 

Related News