హ్యాపీ మూడ్‌లో జాన్వికపూర్

ఎట్టకేలకు శ్రీదేవి కూతురు జాన్వి‌కపూర్ ఊపిరి పీల్చుకుంది. ఆమె నటిస్తున్న ఫస్ట్ మూవీ ‘దఢక్’ చిత్రీకరణ శుక్రవారంతో పూర్తికావడంతో హ్యాపీ మూడ్‌లో కనిపించింది. దీంతో ఇషాన్- జాన్విలు సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. షూటింగ్ పూర్తి కావడంతో యూనిట్ ఓ వేడుకను నిర్వహించింది. దీనికి డైరెక్టర్ శశాంక్ ఖైతాన్, బోనికపూర్ తదితరులు హాజరయ్యారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీని తర్వాత ప్రమోషన్‌లో నిమగ్నం కానున్నారు. మరాఠీలో ఘన విజయం సాధించిన ‘సైరత్’ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా జాన్వి వెండితెరపై అడుగు పెట్టేసింది. దఢక్.. జూలై 20న దేశవ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. మరి యువ నటీనటులు ఫస్ట్ పరీక్షలో ప్రేక్షకుల నుంచి ఎన్ని మార్కులు సొంతం చేసుకుంటారో చూడాలి.

READ ALSO

Related News