ఏపీలో జాతీయ రహదారుల దిగ్బంధం

ఏపీకి ప్రత్యేక హోదాకోసం జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపిచ్చిన అఖిలపక్ష సంఘాలతో వైసీపీ, జనసేన జతకట్టాయి. జాతీయ రహదారుల దిగ్బంధానికి మద్దతు జనసేన పార్టీ మద్ధతు తెలిపింది. కళ్లకు గంతలు కట్టుకుని నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతామని జనసేన ప్రకటించింది. ఏపీలోని 13 జిల్లాల్లోనూ గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా జాతీయ రహదారులను దిగ్బంధించాలని ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఇటీవల సీపీఎం, సీపీఐలు ప్రజాసంఘాల ఐక్యవేదిక నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనకు వైసీపీ సంఘీభావం తెలిపింది. రహదారుల దిగ్బంధంలో పొల్గొనాలని పార్టీ శ్రేణులను జగన్‌ ఆదేశించారు. కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతును ఇచ్చింది. విజయవాడ కనకదుర్గమ్మ వారధి దగ్గర జరిగే కార్యక్రమంలో కాంగ్రెస్‌ పాల్గొంటుందని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి తెలిపారు. అటు టీడీపీ కూడా నిరసనకు మద్ధతు తెలిపింది. అయితే, అధికారంలో ఉన్నందున బంద్‌లూ, రాస్తారోకోలలో పాల్గొనే అవకాశం లేదని రహదారుల పక్కన టెంట్లు వేసి నిరసన వ్యక్తం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.

Related News