బాలయ్య ఫ్యాన్స్‌కి ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

బాలకృష్ణ లేటెస్ట్ ఫిల్మ్ జైసింహా. సంక్రాంతి సందర్భంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. థియేటర్స్ ఓనర్స్.. రోజుకి ఏడు షోలు ప్రదర్శించుకోవచ్చని అనుమతినిచ్చింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ఒక విధంగా బాలయ్య అభిమానులకు ఇది శుభవార్త. శుక్రవారం నుంచి 16 తేదీ వరకు అనుమతి ఇచ్చింది. తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే! అభిమానుల రద్దీ, బ్లాక్‌ టికెట్ల అమ్మకాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. బాలకృష్ణ పక్కన నయనతార, హరిప్రియ, నటాషాదోషిలు హీరోయిన్లు. ‘అజ్ఞాతవాసి’ మూవీకి ప్రత్యేక ప్రదర్శనలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే!

Related News