జోయ్‌ అలుక్కాస్‌‌పై ఐటీ రైడ్స్

జ్యూయలరీ సంస్థ జోయ్‌ అలుక్కాస్‌కి షాక్‌ ఇచ్చారు ఐటీ అధికారులు. పన్ను ఎగవేత ఆరోపణలతో దేశవ్యాప్తంగా ఆ కంపెనీకి చెందిన 130 ప్రాంతాల్లోవున్న షోరూంలపై అధికారులు దాడులు చేశారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పూణె, కోల్‌కత, తెలంగాణ, ఏపీ ప్రాంతాల్లో జోయ్ అలుక్కాస్‌కి చెందిన షోరూమ్‌ల్లో బుధవారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు.

డ్యూటీకి వచ్చిన ఉద్యోగులను బయటేవుంచారు అధికారులు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టామని, అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఓ సీనియర్ అధికారి మీడియాకి చెప్పారు. కాగా గల్ఫ్ దేశాలలో స్థాపించిన జోయ్‌ అలుక్కాస్‌ గ్రూపుకు ఒమన్, బహ్రెయిన్, ఇండియా, యూకే సహా 11 దేశాలలో భారీ సంఖ్యలో షోరూంలున్నాయి.

Related News