హ్యాట్సాఫ్ టు ఇస్రో.. మరో ఘన విజయం

ఇస్రో కీర్తి కిరీటంలో ఇది మరో ఘన విజయం. శుక్రవారం ఉదయం 9.29 గంటలకు భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ప్రయోగించిన 100 వ ఉపగ్రహం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళి కక్ష్యని చేరుకుంది.

పీఎస్ఎల్వీసీ-40 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్)..వాతావరణ పరిశీలక ఉపగ్రహం (కార్టో శాట్-2)తో బాటు మరో 30 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకుపోయింది. వీటిలో 28 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవి కాగా..భారత్ కు చెందిన కార్టో శాట్-2 ఈ, ఓ నానో శాటిలైట్, ఓ సూక్ష్మ ఉపగ్రహం ఉన్నాయి.

710 కేజీల బరువున్న కార్టో శాట్ లో అత్యాధునిక కెమెరాలు అమర్చారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఒకే రాకెట్ లో 104 ఉపగ్రహాలను ఒకేసారి రోదసిలోకి పంపిన ఘనత ఇస్రో సొంతం. ఆ ప్రయోగంతో అమెరికా, రష్యాల సరసన భారత్ కూడా చేరింది.

 

Related News