ఇండిగో విమానాల రద్దు

ఇంజన్లలో లోపం వంటి సాంకేతిక కారణాలతో.. ఇండిగో, గో ఎయిర్ విమానాలు దాదాపు 65 రద్దయినట్టు డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా వందలాది ప్రయాణికులు అవస్థల పాలయ్యారు. ఇండిగో సంస్థ రోజుకు సుమారు వెయ్యి విమానాలు నడుపుతుండగా..వాటిలో 47 విమాన సర్వీసులను రద్దు చేసింది. అలాగే వాడియా గ్రూప్ ప్రమోట్ చేస్తున్న గో ఎయిర్..రోజుకు 230 ప్లేన్స్ ను నడుపుతుండగా..వాటిలో 18 విమానాలను రద్దు చేసింది.
ఫలితంగా హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్ కతా, బెంగుళూరు వంటి నగరాలకు ఈ విమాన సర్వీసులు రద్దయినట్టు డీజీసీఏ తెలిపింది.అహ్మదాబాద్ నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానం సోమవారం ఇంజన్ లోపం కారణంగా 40 నిముషాలకే తిరిగి అహ్మదాబాద్ చేరుకోవడంతో డీజీసీఏ దీన్ని తీవ్రంగా పరిగణించింది. కాగా-తమ విమాన సర్వీసును ఎంపిక చేసుకున్న ప్రయాణికులు ఎలాంటి క్యాన్సిలేషన్ చార్జీలు లేకుండానే తమ టికెట్ రేట్లను రీఫండ్ చేసుకోవచ్చునని ఇండిగో సంస్థ స్పష్టం చేసింది.

Related News