ఎన్నారైని వెంటాడి, ఆపై హత్య చేశారు

భారత సంతతికి చెందిన 34 ఏళ్ల వుమెన్ ఫార్మాసిస్ట్‌ని గుర్తు తెలియని దుండగుడు వెంటాడి దారుణంగా హత్య చేశాడు. ఉత్తర ఇంగ్లాండ్‌లోని మిడిల్స్‌బరో టౌన్‌లో వుంటోంది జెస్సీకా ఫ్యామిలీ. జెస్సీకా- మితేష్‌ దంపతులు మూడేళ్లుగా ఓ ఫార్మసీని నడుపుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌లో చదువుతున్న సమయంలో వీళ్లిద్దరు మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి చివరకు మ్యారేజ్‌కి దారితీసింది.

సోమవారం ఆమెని వెంటాడి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మరి ఈ ఘటన వెనుక ఏం జరిగింది? జెస్సీకా మృతికి గల కారణాలను ఇప్పుడే వెల్లడించలేమని అంటున్నారు అక్కడి పోలీసులు. ఈ ఘటనపై ఎలాంటి సమాచారమున్నా తమను సంప్రదించాలని స్థానికులను కోరారు. జెస్సీకా వుండే ప్రాంతం అత్యంత రద్దీగా వుండడంతో ఆధారాలను సేకరించేందుకు కష్టంగా మారిందని అంటున్నారు.

READ ALSO

Related News