ఇమ్రాన్‌‌ఖాన్‌కు భారత్ ఫస్ట్ గిఫ్ట్

పాకిస్థాన్‌కు కాబోయే ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చింది భారత్. టీమిండియా క్రికెటర్లు సంతకాలు చేసిన బ్యాట్‌ను ఆయనకు పాక్‌లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియా అందజేశారు. శుక్రవారం అజయ్, ఇమ్రాన్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా క్రికెటర్లు సంతకాలు చేసిన బ్యాట్‌ను అందించారు.

ఇరు దేశాల మధ్య సంబంధాలు, ఇతర అంశాలపై చర్చించినట్టు భేటీ తర్వాత భారత హై కమిషనర్ బిసారియా తెలిపారు. ఇమ్రాన్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపిన తర్వాత జరిగిన తొలి విదేశాంగ కార్యక్రమం ఇది.

READ ALSO

Related News