ఫేస్‌బుక్‌పై కఠినచర్యలు – రవిశంకర్ ప్రసాద్

ఫేస్‌బుక్ వ్యవహారం వెస్ర్టన్ దేశాలను ఓ కుదుపు కుదిపేస్తోంది. తాజాగా దీనిపై కేంద్రప్రభుత్వం కూడా స్పందించింది. భారత ఎన్నికల ప్రక్రియను ఫేస్‌బుక్‌ ఏమాత్రం ప్రభావితం చేసినా సహించబోయేది లేదని హెచ్చరించారు కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. అవసరమైతే ఫేస్‌బుక్‌పై ఎటువంటి కఠిన చర్యలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పత్రికా స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రభుత్వం ఎప్పటికీ మద్దతు ఇస్తుందని, భారత్‌లో ఐటీ శాఖ గురించి మార్క్‌ ఫేస్‌బుక్ వ్యవస్థాపకులు జుకర్‌బర్గ్‌‌కు తెలుసని, దీనిద్వారా భారతీయులకు సంబంధించిన ఎటువంటి డేటా అయిన అపహరణకు గురైతే దాన్ని ఎంతమాత్రం సహించమని,  అందుకు ఐటీ చట్టం కింద కఠిన శిక్షలు ఉంటాయని గుర్తు చేశారు. మీకు సమన్లు పంపే అధికారం కూడా మాకు వుందని హెచ్చరించారు.

పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కేంబ్రిడ్జి అనలిటికాతో కాంగ్రెస్‌ పార్టీకి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. డేటాను దొంగిలించడం లేదా తారుమారు చేసి గెలవడంపైనే కాంగ్రెస్‌ పార్టీ ఆధారపడుతుందా? రాహుల్‌గాంధీ గెలిస్తే అందులో కేంబ్రిడ్జి అనలిటికా పాత్ర ఏంటి? ఎంతమంది భారతీయుల డేటాను కేంబ్రిడ్జి అనలిటికా సీఈవోకి కాంగ్రెస్‌ ఇచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్‌ అనలిటికా సంస్థకు దాదాపు 5 కోట్లమంది ఫేస్‌బుక్‌ ఖాతాల సమాచారం చిక్కిందని వార్తలొచ్చాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాల్సిందేనని అమెరికా సహా బ్రిటన్‌ ఈయూ దేశాల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ బ్రిటన్‌ పార్లమెంటరీ కమిటీ.. ఫేస్‌బుక్‌ అధినేత జుకర్‌బర్గ్‌కు నోటీసులు పంపింది. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరిపాకాన పడింది.

Related News