నెహ్రూ వల్లే భారత్ విడిపోయింది : దలైలామా

భారత జాతిపిత మహాత్మా గాంధీ జిన్నాను ప్రధాని చేయాలని భావించారని సంచలన విషయం బయటపెట్టారు ప్రముఖ ఆధ్మాత్మిక బౌద్ధ గురువు దలైలామా. అయితే, అందుకు నెహ్రూ అంగీకరించలేదని చెప్పారు. మహ్మద్‌ అలీ జిన్నాను ప్రధాన మంత్రి చేసి ఉంటే భారతదేశం ముక్కలయ్యేది కాదన్నారు. సమాజంలో తప్పులు జరుగుతూనే ఉంటాయని, నెహ్రూ చాలా అనుభజ్ఞుడు.. అయినాకాని ఆయన కూడా తప్పులు చేశారని దలైలామా చెప్పారు.

తాను ప్రధాని కావాలనుకుంటున్నట్టు నెహ్రూ.. గాంధీతో అన్నట్లు దలైలామా వెల్లడించారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పు చేస్తారని, భారత మాజీ ప్రధాని జవహర్‌ లాల్‌ లాంటి గొప్ప వ్యక్తులు కూడా అందుకు అతీతం కాదన్నారు. గోవా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దలైలామా.. తప్పులు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

READ ALSO

Related News