హైదరాబాద్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై హత్యాయత్నం!

ఓ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తృటిలో తప్పించుకున్నారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆయన సేఫ్‌గా బయటపడ్డారు. మహారాష్ర్టలో జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఔరంగాబాద్ సభ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది.

రాజాసింగ్ కారుని ఢీకొట్టే ప్రయత్నం చేసింది ఓ లారీ. డ్రైవర్ జాగ్రత్తగా వ్యవహరించడంతో ఎమ్మెల్యేకి పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ఎమ్మెల్యే కాన్వాయిలోని ఓ వాహనాన్ని ఢీకొట్టింది ఆ లారీ. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల ఆశీస్సులతో తప్పించుకున్నానని అంటున్నారు.

ప్రస్తుతం లారీ డ్రైవర్ పరారీలోవుండగా, క్లీనర్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంతకీ రాజాసింగ్‌ది ప్రమాదమా? హత్యాయత్నమా? ఎమ్మెల్యేని హతమార్చేందుకు లారీతో దాడికి ప్లాన్ చేశారా? ఒకవేళ హత్యాయత్నమే అయితే దీని వెనుక వున్నది ఎవరు? ఇలా రకరకలా ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News