రిహార్సల్స్‌లో అప‌శ్రుతి.. కిందపడిన జ‌వాన్లు

ఆర్మీ డే కోసం జ‌వాన్లు చేస్తున్న రిహార్సల్స్‌లో అప‌శ్రుతి చోటు చేసుకుంది. ఢిల్లీలో గురువారం జవాన్లు పరేడ్‌ డ్రిల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారు. పరేడ్‌ మైదానం వద్ద హెలికాప్టర్‌ నుంచి తాడుతో దిగుతుండగా ముగ్గురు జవాన్లు కిందపడిపోయారు. తొలుత జవాన్లు ఒక్కొక్కరుగా దిగుతుండగా నాలుగో వ్యక్తి దిగడానికి సిద్ధమవుతుండగా తాడు తెగిపోవడంతో కొన్ని అడుగుల ఎత్తు నుంచి కిందనున్న జవాన్లపై పడ్డాడు. దాంతో వాళ్లకి గాయాల‌య్యాయి. గాయపడిన ముగ్గురిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వారి ప్రాణాల‌కు ఎలాంటి ప్రమాదం లేద‌ని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటికి రావడంతో వైరల్‌గా మారింది. దానిపై ఓ లుక్కేద్దాం..

Related News