ప్రభాస్‌ ‘బాహుబలి’కి పెద్ద అభిమాని- హాలీవుడ్ నటుడు

హాలీవుడ్ స్టార్స్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులుంటారు. అందులో బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులు కూడా ఉన్నారు. కానీ, రెబల్‌స్టార్ ప్రభాస్‌కు ఓ హాలీవుడ్ స్టార్ అభిమానిగా మారిపోయాడు. ఈ మధ్యే ప్రపంచవ్యాప్తంగా సంచలన వసూళ్లు సాధించిన ‘బ్లాక్ పాంథర్’లో ఎంబాకు రోల్ ప్లే చేశాడు నటుడు విన్‌స్టన్ డ్యూక్. బాహుబలి ఫిల్మ్ చూసి బాగా ఇంప్రెస్ అయ్యానంటూ ఓ టీవీ షోలో పాల్గొన్న డ్యూక్, ఈ విషయాన్ని వెల్లడించాడు.

తను చిన్నప్పటి నుంచి బాలీవుడ్ సినిమాలు చూస్తుంటానని, టొబాగోలో ఉన్నపుడు చుట్టూ భారతీయులు ఉండేవాళ్లని, అందుకే తను కూడా బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగానంటూ మనసులోని మాట బయటపెట్టాడు.

Related News