మల్లికా మళ్లీ అదేమాట..

బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా‌షెరావత్ మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. తాను వుంటున్న అపార్ట్‌మెంట్ రెంట్ కట్టకపోవడంతో దానిని సీజ్ చేసేందుకు ఫ్రెంచి కోర్టు ఆదేశాలిచ్చింది. మల్లిక దంపతులు పారిస్‌లో నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌కు నెలకు 6,054 యూరోల (మొత్తం 78,787యూరోలు) చొప్పున చెల్లించాల్సివుందని, ఇప్పటివరకు కేవలం 2,715 యూరోలు మాత్రమే చెల్లించారని అపార్ట్‌మెంట్ ఓనర్ న్యాయస్థానంని ఆశ్రయించాడు. ఆయన పిటిషన్‌ని విచారించిన కోర్టు, మల్లికా అపార్ట్‌మెంట్‌లో ఫర్నిచర్‌ను స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

ఈ వార్తపై మరోసారి స్పందించింది ఈ అమ్మడు. తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తమని చెబుతూనే, ఇదే విషయమై గతంలో చెప్పాను.. ఇప్పుడు అదే చెబుతున్నాను. తను పారిస్‌లో వుండలేదని, గడిచిన ఎనిమిది నెలలుగా లాస్‌ఏంజెల్స్‌లో వుంటున్నానని, దయచేసి తప్పుడు ప్రచారం చేయవద్దని తన ట్విట్టర్‌లో రాసుకొచ్చింది.

 

 

Related News