AP and TS / Entertainment
‘జైసింహ’లో నాపనైపోయింది

బాలకృష్ణ- నయనతార- నటాషా దోషి- హరిప్రియ కాంబోలో వస్తోన్న మూవీ ‘జై సింహ’. ఈ మూవీలో ఓ వైపు షూటింగ్ జరుగు తుండగానే మరోవైపు డబ్బింగ్ పనులు చకచకా జరిగిపోతున్నాయి. హీరోయిన్ హరిప్రియ తన రోల్‌కి తనే డబ్బింగ్ చెప్పు కుంది. డబ్బింగ్ విషయంలో నిత్యా, కాజల్, సమంత వంటి హీరోయిన్లు రూటులోనే ఈ బ్యూటీ కూడా నడుస్తోంది.

 

ఇక ‘జైసింహ’ గురించి నాలుగు ముక్కలు బయటపెట్టింది ఈ అమ్మడు. తన రోల్‌ని చాలా ఎంజాయ్ చేశానని, ఈ చిత్రం హిట్టవుతుందనే ఒపీనియన్‌ని వ్యక్తంచేసింది. బాలకృష్ణ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నానని, తెలుగు సాహిత్యం, ఆధ్యాత్మికతపైనా ఎంతో అవగాహన వుందని, ఆయనతో మాట్లాడితే నాలెడ్జ్ పెరుగుతుందని మనసులోనిమాట బయట పెట్టింది. బాలయ్యతో కలిసి నటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది.

 

Read Also

 
Related News