India / Politics
ఇక మీరే దిక్కు.. న్యాయం చేయాల్సిందే

ఆర్కే నగర్ ఉప ఎన్నికలో తన నామినేషన్ తిరస్కరణ మీద తమిళ హీరో విశాల్ ఫైట్ చేయడానికే నిర్ణయించుకున్నాడు. న్యాయం ఇంకా బతికే ఉందని, తనకు జస్టిస్ జరుగుతుందని ఆశిస్తున్నానని అంటూ ఏకంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. ఇక మీరే నా విషయాన్ని చూడాలి..నాకు న్యాయం జరిగేలా చూడండి అంటూ కోరాడు.

మొదట నా నామినేషన్ ని అంగీకరించినట్టు చెప్పారు.. ఆ తరువాత తిరస్కరించారు. ఇదంతా అసమంజసంగా లేదూ అని విశాల్ ప్రశ్నించాడు. రాష్ట్ర చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ని కూడా కలిసి..రిజెక్ట్ నిర్ణయాన్ని మళ్ళీ పరిశీలించాలని కోరిన ఈయన..రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ని కూడా కలుసుకునే యోచనలో ఉన్నాడట. ఈ ఉప ఎన్నికలో పోటీ చేయలేకపోతున్నానన్న బాధ కన్నా..ఈ వ్యవస్థ ఇంత పతనమైందన్న బాదే ఎక్కువగా ఉందని విశాల్ వాపోతున్నాడు.

 

Read Also

 
Related News