ఒకసారి కోపం.. ఇంకోసారి ఏడుపు..ఛ..ఛ

తన ‘ గీత గోవిందం ‘ చిత్రంలోని కొన్ని సీన్స్ లీక్ అయినట్టు వచ్చిన వార్తలపై హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు. ఇది తెలిసి నవ నాడులూ కుంగినట్టయింది. చాలా హర్ట్ అయ్యా.. ఒకసారి కోపం వస్తుంది..ఇంకోసారి ఏడుపొస్తుంది..అని తన ట్విటర్ లో ట్వీటించాడు. అయితే విజయ్ ఫ్యాన్స్ చాలామంది..అతడ్ని ఓదార్చారు.

కొన్ని సన్నివేశాలు లీక్ అయినంత మాత్రాన..ఈ మూవీ సక్సెస్ కి ఢోకా ఏమీ లేదని, విజయం గ్యారంటీ అని భరోసా ఇచ్చారు. ఇదే సినిమాతో బాటు అరవింద సమేత వంటి ఇతర చిత్రాల సీన్స్ కూడా లీక్ అయినట్టు వార్తలు వచ్చాయని, ‘ లీకు వీరులను’ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వాళ్ళు గుర్తు చేశారు.

READ ALSO

Related News