జగన్ బయోపిక్.. హీరో పాత్రలో సూర్య.. వైరల్ !

కేతిరెడ్డి తీస్తానన్న ‘లక్ష్మీస్ వీరగంధం’ ఎక్కడుందో తెలీదు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించబోయిన ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ అటకెక్కి కూర్చుంది. తీస్తేగీస్తే మా నాన్న సినిమా నేనే తీస్తానన్న బాలయ్యకి ఇప్పుడు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో ఎన్టీయార్ బయోపిక్ లొల్లి ఓ కొలిక్కొచ్చినట్లే లెక్క. మరి.. వైఎస్ బయోపిక్ సంగతి..? ఇది కూడా డిసెంబర్లోగా సెట్స్ మీదకెళ్ళడం ఖాయమంటూ డైరెక్టర్ మహి. వీ. రాఘవ్ క్లారిటీ ఇచ్చేశారు. లీడ్ రోల్స్ విషయంలో మాత్రం సస్పెన్స్ తప్పలేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద సినిమా తియ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సోషల్ మీడియా తెగ కూసేస్తోంది. జగన్ బయోపిక్ కి పూనుకున్నదెవ్వరు..? ఎప్పుడు ఎక్కడ మొదలవుతుందన్న వివరాల కంటే ముందు.. యువనేత జగన్ పాత్ర ఎవరు వేయబోతున్నారన్న ముచ్చట మాత్రమే హల్చల్ చేస్తోంది. జగన్ పాత్రలో తమిళ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్నారన్నది తాజా షాకింగ్ ‘న్యూస్’.

జగన్ తో సూర్యకు సాన్నిహిత్యం ఉండడం, జగన్ భాగస్వామ్యం వున్న భారతీ సిమెంట్స్ కి సూర్య బ్రాండ్ అంబాసిడర్ కావడం.. లాంటి బేసిక్స్ ఆధారంగా సూర్య పేరు బలంగా వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో జగన్ కరిష్మాకు తోడయ్యేలా వైసీపీ సానుభూతిపరుడొకరు ఈ ‘బయోపిక్’ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ బాడీ లాంగ్వేజ్ కి బాగా సింకయ్యే సూర్య ఈ బయోపిక్ కి ఓకె అయితే.. వైసీపీ ఫ్యాన్స్ కి పండగే మరి.

Related News