హెబ్బా టార్గెట్..‘24 కిస్సులు’

తక్కువ సినిమాలతో యూత్‌కి మరింత దగ్గరైంది హీరోయిన్ హెబ్బాపటేల్. సరైన హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈ బ్యూటీ, ఈసారి యూత్‌ని ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఈసారి ముద్దులతో యూత్‌ని పిచ్చెక్కించేందుకు రెడీ అయిపోయింది. మిణుగురులు మూవీతో విమర్శకుల ప్రశంసలతోపాటు అవార్డులు అందుకున్న డైరెక్టర్ అయోధ్యకుమార్ చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ ‘శ్రీలక్ష్మీ అండ్ 24 కిసెస్’.

ఇందులో హీరోయిన్‌గా హెబ్బా నటించనుంది. ఈ చిత్రం గురించి మాట్లాడిన హెబ్బా.. కుమారి 21 ఎఫ్ మాదిరిగానే 24 కిసెస్‌లో తనది చాలా బోల్డ్ క్యారెక్టర్ అని చెప్పేసింది. ఆ మూవీ ఎంత క్రేజ్ వచ్చిందో, దీనికి కూడా అంతే క్రేజ్ వస్తుందనే ఆశాభావం వ్యక్తంచేసింది. కుమారి 21 ఎఫ్, ఆడోరకం ఇడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత మళ్లీ పెద్దగా హిట్స్ అందుకోలేని హెబ్బాపటేల్. మరి ఈసారైనా హిట్ అందుకుంటుందేమో చూడాలి.

Related News