నడిరోడ్డుపై తెరాస కార్పొరేటర్ తీన్మార్

హయత్ నగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి నడిరోడ్డుపై హుషారుగా తీన్మార్ ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల తన స్నేహితులు, అనుచరులతో కలిసి శ్రీశైలం వెళ్ళిన ఆయన తిరిగి వస్తూ.. హైవేపై ఆగి..వారితో తీన్మార్ డ్యాన్స్ చేయడం విశేషం. దీన్ని వీడియో తీసిన అనుచరులు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఈ కార్పొరేటర్ తో బాటు డ్యాన్స్ చేసిన వారిలో జీహెచ్ఎంసీకి చెందిన ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నట్టు సమాచారం. అటు- వీరు నడిరోడ్డుపై డ్యాన్స్ చేస్తూ పబ్లిక్ కి ఇబ్బందులు సృష్టించినట్టు భావించిన తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ కమిషనర్ కూడా సీరియస్ అయినట్టు తెలిసింది. వీరి నుంచి సంజాయిషీని  కోరవచ్చు.

 

Related News