హాకింగ్ అస్థికలు అక్కడే..

ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ అస్థికలను ఈనెల 31 న లండన్ వెస్ట్ మినిస్టర్ అబేలోని సర్ ఐజాక్ న్యూటన్, చార్లెస్ డార్విన్ సమాధులవద్ద ఉంచనున్నారు. 76 ఏళ్ళ స్టీఫెన్ హాకింగ్ ఈ నెల 14 న కన్నుమూశారు.

న్యూటన్ 1727 లో, డార్విన్ 1882 లో మరణించారు. హాకింగ్ కు అత్యంత ఇష్టమైన కేంబ్రిడ్జి యూనివర్సిటీ చర్చిలో ఈస్టర్ ఆదివారం నాడు శ్రద్ధాంజలి కార్యక్రమం జరుగుతుందని ఆయన సన్నిహితులు, చర్చి వర్గాలవారు తెలిపారు. వెస్ట్ మినిస్టర్ అబే లోనే ఎర్నెస్ట్ రూథర్ ఫర్డ్, జాన్ థామ్సన్ వంటి శాస్త్రవేత్తల సమాధులున్నాయి.

Related News