బోటు ఓనర్, డ్రైవర్ తప్పిదంవల్లే ఘోరం

గోదావరిలో బోటు మునిగిపోవడానికి డ్రైవర్, బోటు ఓనరే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ బాధితుల కథనం ప్రకారం బోటు ఓనర్, సిబ్బంది నిర్వాకం వల్లే బోటు మునిగిపోయిందని చెబుతున్నారు. ప్రమాదం జరిగే కొన్ని సెకన్లముందు బోటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగే అవకాశం ఉన్నా బోటు డ్రైవర్ చేసిన తప్పుకు లాంచ్ నీట మునిగిపోయిందని ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు. పడవ మునిగిపోతున్న వెంటనే బోటు యజమాని ఖాజా మొయినుద్దీన్, బోట్ డ్రైవర్లు, సిబ్బంది వెంటనే తమను తాము రక్షించుకుని పారిపోయారు కాని, బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేయలేదని బోటు ప్రమాదం నుంచి బయటపడ్డ బాధితులు చెబుతున్నారు.

Related News