60 అడుగుల లోతులో లాంచీ.. బోటులోనే మృతదేహాలు

పాపికొండల్లోని దేవీపట్నం మంటూరు దగ్గర నీటి మునిగిపోయిన లాంచ్ జాడ ఎట్టకేలకు తెలిసింది. ఈ ఉదయం తిరిగి తమ ప్రయత్నాలు ప్రారంభించిన రెస్కూటీం మొత్తానికి బోటు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. 60అడుగుల లోతులో ఇసుకలో బోటు కూరుకుపోయింది. మృతదేహాలు అన్నీ బోట్ లోనే ఉన్నట్టు గుర్తించిన సిబ్బంది బోటు అద్దాలు పగులగొట్టి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 4గంటల ప్రాంతంలో బోట్ నీట మునిగిపోగా, రాత్రి రెండు గంటల వరకూ బోటు జాడకోసం ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ బోడుజాడ దొరకలేదు. దీంతో ఈ ఉదయం నుంచి మళ్లీ బోటును వెతికే ప్రయత్నాలు చేశారు. సహాయక చర్యల్లో నేవీ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు.

Related News