గజల్‌కు జైల్లోనే సంక్రాంతి.. పరారీలోనే పనిమనిషి

గజల్ శ్రీనివాస్ కు ఈసారీ కోర్టులో చుక్కెదురైంది. ఆలయవాణి అనే తన ఆఫీస్ లో పనిచేస్తున్న మహిళలపై లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న గజల్ శ్రీనివాస్‌ కు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు నిర్ణయించింది. ఆయనకు మరో 2 వారాల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అటు పనిమనిషి పార్వతి పోలీసులకు లొంగకుండా ఇంకా పరారీలోనే ఉంది. రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు గజల్ ను ఇవాళ నాంపల్లి కోర్టు ముందు హాజరుపర్చారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో తిరిగి గజల్ ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కోర్టు దగ్గరకు వచ్చిన గజల్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.

Related News