వాళ్ళు చేసింది తప్పయితే.. నేను చేసిందీ తప్పే..!

లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బేనర్ పై రూపొందుతున్న మూవీ ‘గాయత్రీ’ టీజర్ రిలీజయింది. మోహన్ బాబు బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో నడిచిన నిమిషం టీజర్.. ఆద్యంతం సీరియస్ గా సాగింది. సినిమాలోని సాఫ్ట్ కంటెంట్ ని రివీల్ చెయ్యకుండా స్టోరీ లైన్ బైట పెట్టకుండా జాగ్రత్తగా తయారు చేశారు టీజర్ ని. రామాయణ, మహాభారతాల్లో జరిగిన యుద్ధాల వల్ల సామాన్య సైనికులు చనిపోవడాన్ని ప్రశ్నిస్తూ.. ఇప్పుడు తాను కూడా అటువంటి పనికే పాల్పడుతున్నాను అంటూ ముగిస్తాడు లీడ్ యాక్టర్ మోహన్ బాబు. ”వాళ్ళు చేసింది తప్పయితే.. నేను చేసిందీ తప్పే” అన్నది అతడిచ్చిన కంక్లూజన్. ఈ మూవీని మదన్ రామిగాని డైరెక్ట్ చేస్తున్నాడు. కథ, డైలాగ్స్ డైమండ్ రత్నబాబు అందించారు. ఎస్ఎస్ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ వెయిట్ ని పెంచేసింది.

Related News