గాలి రాజా.. నువ్వే దిక్కు!

ప్రమాణ స్వీకార ఘట్టాన్ని ఎలాగోలా ముగించినప్పటికీ.. మిగతా ఎనిమిది మంది ఎక్కడప్పా.. అంటూ రేపటిరోజున గవర్నర్ అడిగే ప్రశ్న ఎడ్డీ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మేజిక్ ఫిగర్ 113 కంటే 8 సీట్లు వెనకబడ్డ ఎడ్డీ.. 15 రోజుల్లో ఆ గ్యాప్‌ని ఫిల్ చేసుకోవాలన్నది గవర్నర్ ఆర్డర్. ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ అనే ఆపరేషన్ షురూ చేయడానికి హైకమాండ్ జోక్యం కోరక తప్పలేదట యెడ్యూరప్పకు. ఇటువంటి సంక్షోభ సమయాల్లో గట్టి చెయ్యి కోసం వెదికిన కమలనాథులు.. గాలి ఘనుల దగ్గర సిట్టింగ్ వేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల్ని లొంగదీసుకునే పనుల్లో ఆరితేరిన గాలి బ్యాచ్ మళ్ళీ యాక్టివ్ రోల్ లో ఫిక్స్ అయ్యిందన్న మాట!

కాంగ్రెసోళ్లు బుధవారం సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు 78 మందిలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. ఆ ముగ్గురూ బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి సన్నిహితంగా వుండేవారే. రాజ్‌భవన్‌కు చేరేసరికి.. ఎలాగోలా ఇద్దరు ఎమ్మెల్యేల్ని రాబట్టుకున్నారు. ఇక.. ఆనంద్ సింగ్ ఒక్కరే మిస్సయ్యారు. అతడు గాలి జనార్ధన్ రెడ్డితో టచ్‌లో ఉన్నట్లు గుసగుసలు వినబడ్డాయి. ఇటు.. ఐదుగురు జేడీఎస్ ఎమ్మెల్యేలు తమకు బీజేపీ నేతల నుంచి ఫోన్లు వచ్చినట్లు బాహాటంగా చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ‘గాలి’ ప్రమేయం ఉన్నట్లు రెండు పార్టీలూ గట్టిగా నమ్ముతున్నాయి. బెంగళూరు ఈగిల్టన్‌ రిసార్ట్‌‌లో తమ వాళ్ళు ‘భద్రం’గా ఉన్నట్లు చెప్పుకుంటున్నప్పటికీ.. లోలోపల మాత్రం గాలి గుబులు లేకపోలేదు. డబ్బు సంచులకు పెట్టింది పేరైన గాలి సోదరులు.. పొలిటికల్ లాబీయింగ్‌లో కూడా ఆరితేరిన బాపతు. గతంలో సైతం సొంత పార్టీలో ముసలం పుట్టించి.. ఎమ్మెల్యేల్ని హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో దాచిపెట్టుకున్న ఘనుడు గాలి జనార్ధన్ రెడ్డి. ఇప్పుడు కూడా బీజేపీ అధిష్టానం.. హార్స్ ట్రేడింగ్ కోసం ‘గాలి’ అర్థ, అంగ బలాల్ని వాడుకుంటున్నట్లు కన్నడ మీడియా రాస్తోంది.

READ ALSO

Related News