చిన్నారిని వెంబడించిన చిరుతలు

నెదర్లాండ్స్‌లోని డచ్ వైల్డ్‌లైఫ్ పార్కుకు వెళ్లిందో ఫ్రెంచ్ వ్యక్తి కుటుంబం. అక్కడ చిరుతలు స్వేచ్చగా సంచరిస్తుంటాయి. ఈ వ్యక్తి తన భార్య, ఓ చిన్నారితో సహా కారులో ఆ పార్కు కు వెళ్ళడం వరకు బాగానే ఉంది. అయితే కారు దిగి వాటిని చూసేందుకు కొద్ది దూరంలో వెళ్ళారో లేదో.. వాళ్ళ వెనుకే చిరుతలు వెంటబడ్డాయి. ఇది చూసిన ఆయన ముందే కాళ్ళకు పని చెప్పగా..భుజాలపై ఎత్తుకుని ఉన్న తన పాప కారణంగా అతని భార్య వేగంగా పరుగెత్తలేకపోయింది. ఓ చిరుత అయితే ఆమెను దాటి ముందుకు రాబోయింది. అయితే అది హఠాత్తుగా ఉన్నచోటే నిలబడిపోవడంతో.. బతుకుజీవుడా అనుకుంటూ ఆమె ఒక్క పరుగున తమ కారు దగ్గరకు చేరుకొంది. అదృష్టవశాత్తూ ఈ ఫ్యామిలీ కాస్తలో ఆ చిరుతల బారినుంచి తమను తాము కాపాడుకోగలిగింది. వీళ్ళ కారు వెనకే మరో వాహనంలో వస్తున్నవారు దీన్ని వీడియో తీసి యూ ట్యూబ్‌లో పెట్టగా లక్షల లైక్స్ వచ్చాయి.

READ ALSO

Related News