తప్పిపోయిన పిల్లలను గుర్తించే టెక్నిక్

ఇళ్ళ నుంచి పారిపోయిన, లేదా తప్పిపోయిన పిల్లలను ఇక సులభంగా గుర్తించవచ్చునంటున్నారు ఢిల్లీ పోలీసులు. మూడు వేలమంది తప్పిపోయిన బాలలను నాలుగు రోజుల్లోనే గుర్తించి వారిని వారి తలిదండ్రుల వద్దకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి చిన్నారులను గుర్తించేందుకు ఫేసియల్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ ఆర్ ఎస్) అనే ప్రత్యేక సాఫ్ట్ వేర్ సహాయపడిందని వారు తెలిపారు.

తప్పిపోయిన 45 వేలమంది పిల్లలు ఢిల్లీ లోని బాలల సదనాల్లో  ఆశ్రయం పొందుతున్నారు. ఏప్రిల్ 6 నుంచి 10 వ తేదీ వరకు..అంటే కేవలం నాలుగు రోజుల్లోనే ఢిల్లీ లోని ఈ సదనాల్లో ఉంటున్నకొంతమందిని ఈ సిస్టం ద్వారా రికగ్నైజ్ చేసి వారి పేరెంట్స్ వద్దకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో తెలిపింది.

READ ALSO

Related News