నా ఒక్కరోజు సంపాదన ఆ బాధితులకోసం..

కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదలు  అనేకమందిని నిరాశ్రయులను చేశాయని, ప్రాణ, ఆస్తి నష్టం విపరీతంగా జరిగిందని బాలీవుడ్ నటి ఈషా గుప్తా పేర్కొంది. ఈ విపత్కర సమయంలో అంతా మానవతావాదంతో స్పందించాలని, బాధితులను సర్వ విధాలా ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరింది. డబ్బులు, బట్టలు, మందులు, ఇతర ఏ వస్తువులనైనా అందజేసి ఆపన్న హస్తం అందించాలని ఆమె అభ్యర్థించింది. సాయం చేయడం మానవ ధర్మం. ఈ తరుణంలో మనం అత్యవసరంగా స్పందించాల్సి ఉంది. కేరళ బాధితులకు సాయంగా నా ఒక్కరోజు సంపాదనను ముఖ్యమంత్రి సహాయనిధికి పంపాను. అని ఆమె తన ఇన్స్‌టా‌గ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో వెల్లడించింది.

Related News