రెజ్లింగ్‌ స్టార్స్.. సడన్‌గా పెళ్లి ఆగింది

డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్‌ స్టార్స్ జాన్‌సెనా- నిక్కీ బెల్లాల గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆరేళ్లుగా వీళ్లిద్దరూ రిలేషన్ షిప్ కొనసాగించారు. గతేడాది ఏప్రిల్‌లో ట్యాగ్ టీమ్ మ్యాచ్‌ని కలిసి గెలుచుకున్నారు. అదే సమయంలో నిక్కీ బెల్లాకు జాన్‌సెనా ఓ ప్రపోజ్ చేశాడు. మ్యారేజ్ చేసుకోవాలని చెప్పడం, అందుకు ఆమె ఓకే చేయడం జరిగిపోయింది. మే 5న మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతలోనే ఊహించని స్టేట్‌మెంట్. పెళ్లికి సరిగ్గా మూడువారాల ముందు తాము విడిపోతున్నట్టు అనౌన్స్‌మెంట్ చేసేశారు.

ఒక్కసారి ఈ వార్త విని రెజ్లింగ్ అభిమానులు షాకయ్యారు. ఎందుకు విడిపోతున్నట్లు ప్రకటించినప్పటికీ అందుకు గల కారణాలను వెల్లడించలేదు. నిర్ణయం కఠినమైనదే అయినప్పటికీ.. ఇద్దరు ఒకరినొకరం గౌరవించుకోవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. గతంలో ప్రపోజ్ వీడియోపై ఓ లుక్కేద్దాం.

 

Related News