మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గడ్-మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలీ జిల్లా బోరియా అటవీ ప్రాంతంలోని ఏటపల్లి వద్ద సీఆర్పీ‌ఎఫ్ దళాలు జరిపిన కాల్పుల్లో వీరు మృత్యువాత పడ్డారు.

అంతకుముందు ఛత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లాలో మావోలు జరిపిన దాడిలో సీఆర్పీ‌ఎఫ్ ఏఎస్ఐ ఒకరు గాయపడి మరణించారు. దీంతో మావోలకోసం కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతున్న భద్రతాదళాలకు ఏటపల్లి వద్ద వారు తారసపడ్డారు. మరణించిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది.

Related News