సియాటిల్ నుంచి మీ డీఎస్పీ!

బిజీబీ డీఎస్పీ ఏం చేసినా వెరైటీయే! సంగీత పిపాసిగా క్షణం తీరిక లేకుండా గడిపే ఈ మ్యూజికల్ స్టార్.. ఈసారి మహేష్‌బాబు బర్త్‌డే సందర్భాన్ని తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. తనకు బాగా ఇష్టమైన ప్రిన్స్‌ని సరికొత్తగా విష్ చేయాలనుకున్న దేవిశ్రీప్రసాద్.. ప్రస్తుతం తానున్న అమెరికా నుంచే బర్త్‌డే సాంగ్ ట్విట్టర్లో పోస్ట్ చేసి అదోరకమైన సర్ ప్రైజ్ ఇచ్చేశాడు. ‘డియర్ మహేష్.. నేనిప్పుడు సియాటిల్‌లో వున్నా. ఈ అందమైన ఆహ్లాదకరమైన ప్రాంతంలో అంతకంటే అందమైన పియానో మీద పుట్టినరోజు పాట పాడి.. నిన్ను అలరిస్తున్నాను.. నీ 25వ మూవీ మహర్షిలో నేను కూడా ఒక పార్ట్ కావడం నిజంగా నా అదృష్టం” అంటూ ముగించాడు డీఎస్పీ. గోవాలో ఫ్యామిలీతో కలిసి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న మహేష్‌బాబు దీంతో మరింత ఖుషీ అయ్యే ఉంటాడు.

READ ALSO

Related News