డీఎస్ కొడుకుకి నోటీసులు.. 6 బృందాలు గాలింపు

రాజ్యసభ ఎంపీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ తనయుడు నిజామాబాద్‌ మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ ఇంకా పరారీలోనే ఉన్నారు. వారం రోజులుగా పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంజయ్ కోసం ఆరు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. తాజాగా అతనికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నేడు(శనివారం) విచారణకు హాజరుకావాలని నిజామాబాద్‌ పోలీసులు ఆదేశించారు. శాంకరీ నర్సింగ్‌ కళాశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతనిపై కేసు నమోదైన విషయం తెలిసింది. తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురు విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో అతనిపై నిర్భయ సహా, పలు సెక్షలపై కేసు నమోదైంది. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసుపై ప్రభుత్వం విచారిస్తే తప్పకుండా సహరికరిస్తానని చెప్పిన సంజయ్ ఇంకా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు.

 

Related News